Menu


సినిమా పబ్లిసిటీల విషయంలో రకరకాల పద్ధతులను అనుసరిస్తూ తమ సినిమాల క్రేజ్ ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి దాకా ఆడియో ఫంక్షన్స్, విజయోత్సవ సభలను చూసిన సినిమా అభిమానులు మొట్టమొదటి సారిగా ఒక డిఫరెంట్ వెరైటీ పబ్లిసిటీ సినిమా ఫంక్షన్ ను చూడ బోతున్నారు.

ఫిలింనగర్ లో వార్తల ప్రకారం అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మొట్టమొదటి సినిమా షూటింగ్ ఈనెల 16 నుండి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఈ నెల 14న హైదరాబాద్ శిల్పకళా వేదికలో అక్కినేని ఫ్యాన్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అదేవిధంగా ఈ సినిమా యూనిట్ ను అధికారికంగా ప్రకటించే ఆలోచనలో నాగ్ ఉన్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ సమావేశాన్ని చాల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ సయేష సైగల్ ను అధికారికంగా ఎంపిక చేసారు.

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, సైరా బాన్ మనవరాలైన సయేష సైగల్ ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తున్న ‘శివాయ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతమందినో హీరోయిన్స్ గా పరిశీలించిన తరువాత చివరకు సయేష సైగల్ ఎంపికతో అఖిల్ హీరోయిన్ సమస్య తీరింది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78453/VARIETY-PUBLICITY-FOR-THE-SAKE-OF-AKHIL/

0 comments:

Post a Comment

 
Top