ఫిబ్రవరి 13వ తారీఖున విడుదల కాబోతున్న జూనియర్ ‘టెంపర్’ కు అనేక రకాల సెంటిమెంట్లు తోడు అవుతున్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలి అంటూ బండ్ల గణేష్ సోదరుడు శివబాబు శ్రీశైలం వరకు నిన్న హైదరాబాద్ నుండి ౩౦౦ కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించాడు. ‘గబ్బర్ సింగ్’ విడుదల సమయంలో ఇలా చేసిన శివబాబు పాదయాత్ర మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ ను తిరిగి కొనసాగిస్తున్నాడు.
అదేవిధంగా గత సంవత్సరం హైదరాబాద్ భ్రమరాంబ ధియేటర్ లో బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు తెల్లవారుఝామున స్పెషల్ షో వేస్తే కలిసి వచ్చిందని అదే సెంటిమెంట్ ను జూనియర్ ‘టెంపర్’ కు కూడా కొనసాగిస్తూ 13వ తారీఖు తెల్లవారుఝామున ఉదయం 5.07 నిముషాలకు ‘టెంపర్’ స్పెషల్ షోను వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తూ భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారు ఈ సినిమా దర్శక నిర్మాతలు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా హక్కులను పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2.50 కోట్లకు ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కొనడం సంచలనంగా మారింది.
దీంతో పూరీకి ఈ సినిమా పై ఎటువంటి భారీ అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతోంది. ఏది ఎలా ఉన్నా‘టెంపర్’ ఫీవర్ ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.

0 comments:
Post a Comment