కమెడియన్ గా మొదలై హీరో అయి ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్న సునీల్ కెరియర్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో ఉంది. సంవత్సరం గడిచి పోయాక కూడా సునీల్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అంటే సునీల్ పరిస్థితి ఎంత రివర్స్ గేర్ లో ఉందో అర్ధం అవుతుంది. ఈ పరిస్థుతులలో ప్రస్తుతం సునీల్ నటిస్తున్న ఒకే ఒక్క సినిమా పై చాల ఆసలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. గతంలో నాగచైతన్యతో ‘జోష్’ సినిమాను తీసి పరాజయం పొందిన వాసు వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా మారి ఎదో విధంగా సునీల్ ద్వారా హిట్ కొడదామని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు నిర్ణయించినట్లుగా బయట వినపడుతున్న టైటిల్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
‘మల్లెపువ్వు’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసారు అని టాక్. చాల సంవత్సరాల క్రితం శోభన్ హీరోగా కొద్ది సంవత్సరాల క్రితం భూమిక హీరోయిన్ గా ఇదే టైటిల్ తో ‘మల్లెపూవు’ టైటిల్ తో సినిమాలు వచ్చాయి. అయితే ఈ రెండు మల్లెపువ్వులు వెంటనే వాడి పోయాయి
ఇక లేటెస్ట్ గా ఈ మూడవ మల్లెపువ్వు వస్తున్న సునీల్ సినిమా ఏమైనా సువాసనలు నింపుతాయ లేక వాడిపోతుందా అంటూ ఈ సినిమా టైటిల్ పై సెటైర్లు వినపడుతున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78409/SUNIL-DESIRE-TOWARDS-MALLEPUVVU/
0 comments:
Post a Comment