ఒకనాటి గ్లామరస్ హీరోయిన్ గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మిని కూడా సినిమారంగానికి పరిచియంచేసే ఉద్దేశంతో అప్పుడే అనేక ప్రయత్నాలు మొదలు పెట్టింది అని టాక్. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటూ పనిలోపనిగా నాట్యంలోనూ శిక్షణ తీసుకుంటోంది.
ఈ నేపధ్యం లో సుబ్బలక్ష్మిని ఫిల్మ్ ఇండస్ర్టీకి పరిచయం చేసే విషయంలో శ్రుతిహాసన్ సహాయం కావాలని గౌతమి అడిగిందట. అయితే ఈ విషయానికి ఓకే అన్న శృతిహాసన్ ముందుగా సుబ్బలక్ష్మి మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని చెప్పినట్లు టాక్.
అంతే కాదు ప్రస్తుతం శ్రుతి గౌతమి అంగీకారంతో తన చెల్లి పేరు మార్చే పనిలో బిజీగా ఉందని టాక్. ఇప్పటికే తమిళ దర్శక, నిర్మాతలు సుబ్బలక్ష్మిని హీరోయిన్‌గా తమ సినిమాలలో పరిచయం చేస్తామంటూ ముందుకొస్తున్నా అక్షరహాసన్ మాదిరిగానే సుబ్బులక్ష్మిని తొలుత బాలీవుడ్‌లో పరిచయం చేస్తే దేశవ్యాప్తంగా క్రేజ్ రావడంతో దక్షిణాది సినిమాలలో అవకాశాలు అవే వస్తాయని శ్రుతి గౌతమికి సలహా ఇచ్చినట్లు టాక్.
ఏమైనా శ్రుతి ఒక పక్క తన కెరియర్ ను చక్కగా ప్లాన్ చెసుకుంటూ తన చెల్లెళ్ళు అక్షర, సుబ్బలక్ష్మిల కెరియర్ పై కూడా దృష్టి పెట్టడంతో శ్రుతి అక్కగా పెద్ద భాద్యతలే మోస్తోంది అని అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78647/SHRUTI-CHANGING-HER-SISTER/
0 comments:
Post a Comment