ఈమధ్య ముంబాయి ఎయిర్ పోర్ట్ లో ఒక అమ్మాయి తాను ఎక్కవలసిన ఫ్లైట్ కు కొద్ది నిముషాలు ఆలస్యంగా రావడంతో ఆమెకు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులు నిరాకరించారట. మర్నాడు తాను రాయవలసిన ముఖ్యమైన పరీక్ష ఉంది అని అమ్మాయి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదట.
ఆ అమ్మాయి తల్లి ముంబాయిలోనే ఒక కార్పోరేట్ హాస్పటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ ఉండటంతో హాస్పటల్ లో పని ముగించుకుని ఎయిర్ పోర్ట్ రావడానికి ఆలస్యం జరిగింది అని వివరిస్తూ మరునాడు జరగబోతున్న పరీక్ష మిస్ కాకూడదని ఇంత టెన్షన్ లో కూడా ప్రయత్నిస్తున్నాను అని ప్రాధేయ పడినా ఆలస్యం కారణం చూపెడుతూ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఆమెకు బోర్డింగ్ పాస్ నిరాకరించారు అని తెలుస్తోంది.
జరుగుతున్న ఈ విషయాన్ని అంతా అక్కడ ఉన్న ఒక మహిళ తన సెల్ ఫోన్ తో రికార్డు చేసి తన ఫేస్ బుక్ లో పెట్టి చాలామందికి షేర్ చేసింది. ఈ వీడియోను చాలామందితో పాటు చూసిన సమంత తన ట్విటర్ లో ఎయిర్ ఇండియాను తిడుతూ ట్విట్ పెట్టి తన సామాజిక చైతన్యాన్ని మరోసారి చాటుకుంది. ‘జింబోలా మారిపోతున్న ఎయిర్ ఇండియా, ఏడుస్తూ కనిపిస్తున్న ఆ అమ్మాయి పట్ల కనికరం లేని ఎయిర్ ఇండియా’ అంటూ ఏకంగా ఎయిర్ ఇండియానే టార్గెట్ చేస్తోంది సమంత.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79168/SAMANTA-TARGETTING-AIR-INDIA/

 
0 comments:
Post a Comment