Menu

మెగా స్టార్ చిరంజీవి సినిమాలలో ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి డైలాగ్స్ కు వచ్చినంత క్రేజ్ మరే సినిమాలో డైలాగ్స్ కు రాలేదు. అప్పట్లో ఆ పాపులారిటీ చూసుకునే చిరంజీవి అత్యుత్సాహంగా రాజకీయాలలోకి వచ్చాడు అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం’ అని చిరంజీవి గంభీరంగా ‘ఠాగూర్’ సినిమాలో చెప్పిన డైలాగ్ ఆ సినిమాకు కనక వర్షాన్ని కురిపించింది.

అటువంటి పంచ్ డైలాగులను ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ కూడా వాడుతున్నాడు. అయితే సందర్భం వేరు. నిన్న జరిగిన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ముంబాయిలో మీడియా కంట పడిన సల్మాన్ ను వేలంటైన్స్‌ డే రోజున ప్రేమికులకు ఇచ్చే సందేశం ఏంటని అడిగితే, 'ప్రేమ నాకు నచ్చని పదం' అని షాకింగ్ సమాధానం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ నుండి ప్రపంచ సెక్సీయస్ట్ బ్యూటీ కత్రినా వరకు ఎందరినో ప్రేమించి వారందరితో డేటింగ్ చేసిన సల్మాన్ నుండి ఇటువంటి సమాధానాలు రావడం ఎవరికైనా షాకింగ్ న్యూస్.

తాను ప్రేమించే వారికోసం కోట్ల రూపాయలు విలువైన కానుకలు ఇచ్చే సల్మాన్ ఖాన్ తనకు ప్రేమ పట్ల నమ్మకం లేదు అని కామెంట్ చేసాడు అంటే ప్రేమలో ఈ కండల వీరుడు ఎంత ఘోరంగా మోసపోయాడో అర్ధం అవుతుంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78796/SALMANKHAN-IS-USING--CHIRANGEEVI-WORDS/

0 comments:

Post a Comment

 
Top