Menu

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సంగీత హోరు కొంతమందికి సమస్యగా మారింది అంటూ ఈ రోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక సంచలన వార్తను ప్రచురించింది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో ఈవార్త రావడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుఝామున ఈ సoఘటన చోటు చేసుకుంది అని తెలుస్తోంది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే చిరంజీవి ఇంటి నుండి అత్యంత భారీగా సంగీత హోరుకు సంబంధించిన శబ్దాలు తమకు అసౌకర్యంగా ఉంది అని చాలామంది ఫీల్ అయ్యారని టాక్. ఈ సబ్ధాలకు అసౌకర్యానికి గురైన ఒక పోలీసు ఉన్నతాధికారి ఈ విషయమై తన విభాగానికి తెలియచేయడంతో కొంతమంది పోలీసులు ఆ సంగీత హోరును తగ్గించమంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారని ఆ పత్రిక కథనం.

అయితే అప్పటికే రామ్ చరణ్ తన ఇంటిముందు గేటు వద్దకు వచ్చి వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సంగీత విభావరిలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి ఇంటి టెర్రస్ పై మరో నలుగురు యువకులు ఉన్నారని వారంతా కొంతమంది రాజకీయ వేత్తల కుమారులు కూడా ఉన్నట్లుగా ఆ పత్రిక వార్తలలో తెలియచేసింది.

ఆమధ్య సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగితో నడిరోడ్డు మీద వివాదంలోకి దిగి సంచలనం క్రియేట్ చేసిన క్రియేట్ చేసిన చరణ్ ఇప్పుడు మళ్ళీ తన సంగీత హోరుతో మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78265/RAMCHARAN-MUSIC-HUNGAAMA-BECOMES-HOT-TOPIC/

0 comments:

Post a Comment

 
Top