మరి కొద్ది గంటలలో ఫలితం తెలియబోతున్న ‘టెంపర్’ సినిమా పై పూరి జగన్నాథ్ భగవద్గీత సారాంశాన్ని పూర్తిగా వొంటపట్టించుకున్న యోగిలా వేదాంతం మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ రేపటి నుండి తన కొత్త సినిమాలు తాను చేసుకు పోతానని ఈ సినిమా వర్కౌట్ అయినా అవ్వకపోయినా తాను ఎన్టీఆర్, కాజల్ ఎవరి పనులలో వారు బిజీ అయిపోతామని సినిమా జయాపజయాల గురించి బాధపడుతూ కూర్చుంటే 26 సినిమాలు ఇప్పటికి ఎలా తీసి ఉండే వాడిననీ మీడియాకే ఎదురు ప్రశ్న వేసాడు పూరి.
సినిమా జయాపజయాలు తన చేతులో లేదని ఆ సక్సస్ సీక్రెట్ తెలిస్తే తన 26 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యేవికదా అని అంటూ వేదాంతంతో కూడిన అతి తెలివిని ప్రదర్శిస్తున్నాడు పూరి. అంతేకాదు కేవలం మరో పది రోజుల గ్యాప్ తో ఛార్మితో ‘జ్యోతి లక్ష్మి’, ఆ తరువాత వెనువెంటనే వరుణ్ తేజ్ తో మరో సినిమాను చేసుకుంటూ తన ప్రయత్నం తను చేసుకుంటూ పోతానని పెద్ద మాటలు చెపుతున్నాడు పూరి.
భారీ సినిమాలను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు నష్ట పోతారు కాని ఆ సినిమాలలో నటించిన హీరోలకు, హీరోయిన్స్ కు దర్శకులకు నష్టం ఏమి ఉండదు అన్న సత్యాన్ని పూరి మాటలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఈరోజు విడుదల అవుతున్న ‘టెంపర్’ కు పోటీ ఇచ్చే పెద్ద సినిమాలు ఏవీ ఇప్పట్లో విడుదల కావు కాబట్టి టాక్ ఎలా ఉన్నా టెంపర్ కలెక్షన్స్ టెంపర్ ను లేపుతుందని పూరి నమ్మకం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78626/PURI-PHILOSOPHY-ON-TEMPER/

0 comments:
Post a Comment