రీసెంట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మీడియా వారికే ఎదురు ప్రశ్నలు వేసి వారి మైండ్ బ్లాంక్ చేసిందని వార్తలు వస్తున్నాయి. తన పెళ్ళి గురించి వస్తున్న వార్తల పై మీడియా
ప్రశ్నించగా దానికి స్పందిస్తూ హీరోయిన్స్ విషయంలో మీడియాకు ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించడమే కాకుండా హీరోయిన్స్‌కి పెళ్లయితే ఇక కెరీర్ ముగిసినట్లే అని ఎందుకనుకుంటారు? అంటూ మీడియాకు ఎదురు ప్రశ్నలు వేసింది.
అంతే కాకుండా కార్పొరేట్ రంగంలో పెద్ద స్థాయిలో మహిళలు పనిచేయడం లేదా ? వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా ? అలాగని వాళ్లు పెళ్లి చేసుకోగానే ఉద్యోగాలేమీ మానేయడం లేదు కదా అని సమాధానంలేని ప్రశ్నలు వేసింది కాజల్. అంతేకాదు కొంతమంది హీరోలకి 25 ఏళ్లకే పెళ్లయిపోతోంది, ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే వున్నారు కదా అని అంటూ హీరోలను కూడా టార్గెట్ చేసింది మన కాజల్.
వివాహ వ్యవస్థపై తనకు చాలా నమ్మకం అని అంటూ చెపుతున్న కాజల్ ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాల పైనే ఉందని మంచి వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని తనకు లేని ఖంగారు మీడియాకు ఎందుకు అని కాజల్ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ తీసుకున్న మీడియా సంస్థ ప్రతినిధి నోరు వెళ్ళ బెట్టాడని టాక్.
మరి కాజల్ అభిప్రాయాన్ని మన్నించే దర్శక నిర్మాతలు సినిమా రంగంలో ఉన్నారా అన్నదే ప్రశ్న. ఆమె ఎన్ని మాటలు చెప్పినా కాజల్ కెరియర్ మాత్రం ‘టెంపర్’ విజయం పై ఆధారపడి ఉంది అన్నది నిజం.

0 comments:
Post a Comment