ఆమధ్య శ్రుతిహాసన్ ‘ఎవడు’ సినిమాలో తాను నటించిన షూటింగ్ స్పాట్ లోని ఫోటోలను ఎవరో కావాలని మార్ఫింగ్ చేసారు అని గగ్గోలు పెడుతూ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇటువంటి వ్యవహారమే బాలకృష్ణ హీరోయిన్ రాధిక ఆప్టేకు తల నొప్పిగా మారింది. రక్త చరిత్ర సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గత సంవత్సరం బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ద్వారా టాలీవుడ్ లో తన పాపులారిటీని పెంచుకుంది.
ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫోటోలు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈ ఫోటోలు అత్యంత అశ్లీలంగా ఉండటమే కాకుండా కావాలని ఈమెను ఎందుకు టార్గెట్ చేస్తూన్నారో అర్ధంకాని విషయంగా మారింది.
వెబ్ మీడియా ప్రపంచంలో ఎటువంటి మార్ఫింగ్ ఫోటోలతో అయినా ఎదుటి మనిషి పరువు, ఇమేజ్ తో ఆడుకోవచ్చు అన్న విషయానికి ఉదాహరణగా లేటెస్ట్ గా హడావిడి సృష్టిస్తున్న ఈమె వ్యవహారాన్ని పేర్కొనవచ్చు. ఈ వ్యవహారానికి సూత్రధారులు ఎవరు అన్న విషయమై రానున్న రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంలో వెబ్ మీడియా ఎంత మంచి చేయగలుగు తుందో, చెడు చేసే విషయంలో కూడా నేటి వెబ్ మీడియా సంస్క్రుతి ఒక విషంలా సమాజాన్ని ఎలా కలుషితం చేస్తోంది ఈ సంఘటనే మరో ఉదాహరణ.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78297/BALAYYA-HEROINE-IN-MARFING-NEWS/

0 comments:
Post a Comment