ఒకనాటి ‘సిసింద్రి’ టాలీవుడ్ కు యంగ్ సూపర్ స్టార్ గా మారబోతున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ చేసిన కామెంట్ల నేపధ్యంలో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకు సంబంధించిన అఫీషియల్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు ఎందరో టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యాక్రమంలో అఖిల్ సరసన్ నటించబోతున్న సైరా భాను మనవరాలు సయేషా సైగల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమం గ్రాండ్ గా అఖిల్ ను ఎలివేట్ చేయడానికి ఉపయోగ పడటమే కాకుండా బుల్లితెర పై ఈకార్యక్రమం లైవ్ లో రావడంతో లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూసారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న వారంతా అఖిల్ ను అభినందిస్తూ అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో అఖిల్ టాప్ హీరోగా ఎదుగుతాడని ఆశీర్వదించారు. ఈ సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ అఖిల్ ను ‘మనం’ సినిమా ద్వారా ఎప్పుడో పరిచయం చేసామని ఆ సినిమాలో అఖిల్ నటిస్తున్నప్పుడు తన తండ్రి అక్కినేని కళ్ళల్లో చూసిన ఆనందం తాను ఇప్పటికీ మర్చిపోలేనని తన తండ్రిని గుర్తుకు చేసుకున్నాడు నాగార్జున.
ఇక చివరిలో మాట్లాడిన అఖిల్ తన తల్లితండ్రుల గురించి చెపుతూ తన తల్లి వద్ద మంచి ప్రవర్తనను, తన తండ్రి వద్ద బాధ్యతను నేర్చుకున్నానని చెపుతూ అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ అభిమానుల కోరికను తీర్చే సినిమాగా తన మొదటి సినిమాను మారుస్తానని వాగ్దానం చేసాడు అఖిల్.
అంతేకాదు కేవలం అక్కినేని అభిమానుల కోసమే తాను నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని ఆ టాలెంట్ ను అంతా అభిమానుల కోసం చూపెడుతూ తాను నటిస్తున్న ఈసినిమా తన తల్లితండ్రుల గౌరవాన్ని అభిమానుల జోష్ ను మరింత పెంచే సినిమాగా ఉంటుందని తన అభిమానులకు వరస పెట్టి ఎన్నో వాగ్దానాలు చేసాడు అఖిల్.
source::http://www.apherald.com/Movies/ViewArticle/78779/AKHIL-COMMENTS-ON-AMALA-AND-NAGARJUNA/

0 comments:
Post a Comment