Menu



కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం ఇస్తూనే ఉంటారు. చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ తో పని చేసిన యాక్టర్ గా, ఇప్పటికే నాగార్జున పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో వినిపిస్తుంది. ఇధిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో ఓ హాట్ యాంకర్ నటిస్తుందంటూ క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది.

ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో అనసూయ నటిస్తుందని ఇండస్ట్రీ టాక్. అలాగే ఓ పాటలో నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేయటానికి సైతం తను స్క్రీన్ స్పేస్ తీసుకుంటుందని సమాచారం. ఈ మూవీతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని దాదాపు హలోబ్రదర్ మూవీకి రిమేక్ వెర్షన్ లా ఉండేలా, దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ టాక్స్.

ఈ మూవీతో అనసూయకి మంచి బ్రేక్ వస్తే, తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోవడం ఖాయం అని అంటున్నారు. అనసూయకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ, ఫైనల్ గా నాగార్జున మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, హాట్ టాపిక్ గా మారింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76709/NAGARJUNA-TOLLYWOOD-TELUGU-FILMS-ANSUYA-ANASUYA-NE/ 

0 comments:

Post a Comment

 
Top