టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో ఆఫర్స్ కోసం అటు డైరెక్టర్స్, ఇటు హీరోహీరోయిన్స్ అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక కొత్త హీరోయిన్స్ అయితే, దిల్ రాజు ఫోన్ కాల్ కోసం రెడీగా ఉంటారు. ఇదిలా ఉంటే, ఓ స్టార్ హీరోయిన్ మాత్రం, దిల్ రాజు ఇచ్చిన ఆఫర్ కి నో చెప్పటమే కాకుండా, తన బ్యానర్ లో నటించేది లేదంటూ క్లియర్ గా చెప్పుకొచ్చింది.
వివరాల్లోకి వెళితే దిల్ రాజు బ్యానర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మూవీ బొమ్మరిల్లు. తాజాగా బొమ్మరిల్లు2 కోసం దిల్ రాజు ప్రి ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా ఈ సమంతని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు దిల్ రాజు, తన ఆఫీస్ నుండి సమంతకి ఫోన్ చేయించగా, సమంత బొమ్మరిల్లు2 ఆఫర్ ని రిజెక్ట్ చేయటమే కాకుండా, మరో సారి కాల్ చేయోద్దని ని స్ట్రిక్ట్ గా చెప్పిందట.
దీంతో విషయం తెలుసుకున్న దిల్ రాజు, వెంటనే సమంతకి ఫోన్ చేసినా తను ఆన్సర్ చేయటం లేదంట. దీంతో ఈ వ్యవహారం ఆఫీస్ నుండి బయటకు వచ్చి, ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది అనే విషయం గురించి అందరూ చర్చికుంటే, వీరిద్దరి మధ్య ఓ పెద్ద గొడవే జరిగిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సమయంలో సమంత, దిల్ రాజుల మధ్య ఓ విషయంలో గొడవ జరిగిందట. అందుకే దిల్ రాజు అంటే సమంతకి కోపం అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. అయితే ఏ విషయం అనేది మాత్రం ఎవ్వరూ బయటకు చెప్పటం లేదు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76657/Dil-raju-tollywood-telugu-films-dil-raju-news-svsc/
0 comments:
Post a Comment